రాజేంద్రనగర్లో కారు బీభత్సం.. పల్టీలు కొట్టి మరో కారుపై పడింది

రాజేంద్రనగర్లో కారు బీభత్సం.. పల్టీలు కొట్టి మరో కారుపై పడింది

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్( PVNR) ఎక్స్ ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. 198 పిల్లర్ దగ్గర డివైడర్ ను ఢీ కొట్టిన కారు... ముందు వెళుతున్న మరో కారుపై పడింది. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో కారు రెండు చక్రాలు ఊడిపోయాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. 

మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ తోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనలో హైవేపై కాసేపు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.