వనస్థలిపురంలో కారు బీభత్సం.. వృద్దుడికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ వనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు.. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొని పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. స్థానికులు అతడిని హాస్పిటల్ తరలించారు.  

ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు.. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు స్పీడోమీటర్‌ చూపిస్తోంది.