చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు మేడలో నుంచి బంగారాన్ని దొచుకెళ్తున్నారు. తాజాగా మార్నింగ్ వాక్ కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మేడలో నుంచి బంగారాన్ని దొచుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మహిళ ప్రతిఘటించడంతో చైన్ స్నాచర్లు తప్పించుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కోయింబత్తూర్ లో చోటుచేసుకుంది.
కోయింబత్తూర్ కు చెందిన కౌసల్య మే 15 సోమవారం రోజున మార్నింగ్ వాక్ కోసం అని వెళ్లింది. ఈ క్రమంలో ఓ వైట్ కారులో ఇద్దరు దుండుగులు ఆమెను ఫాలో ఆయ్యారు. అయితే ప్యాసింజర్ సీటులో కూర్చున్న ఓ వ్యక్తి ఆమె చైన్ ను పట్టుకున్నాడు. వెంటనే అప్రత్తమైన ఆ మహిళ తన చైన్ ను గట్టిగా పట్టుకుంది. దీంతో మరో వ్యక్తి కారు స్పీడ్ పెంచడంతో కొన్ని మీటర్ల మేర కారుతో పాటు ఆ మహిళను ఈడ్చుకెళ్లారు.
అయినప్పటికీ ఆ మహిళ చైను గట్టిగా పట్టుకోవడంతో స్నాచర్లు అక్కడ్నుంచి జారుకున్నాడు. ఈ ఘటనలో మహిళకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడంతో సీసీ కెమెరాల అధారంగా నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.