
మహబూబాబాద్ జిల్లాలో ఏప్రిల్ 11న తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుగుర్తి చెరువు దగ్గర కారు చెట్టును ఢీ కొట్టింది. దీంతో వెంటనే కారులో మంటలు చెలరేగాయి. మంటలతో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. డ్రైవర్ కారు నుంచి బయటకు దూకడంతో సేఫ్ గా బయటపడ్డాడు. . చెట్టును కారు ఢీకొనగానే ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వచ్చినట్టు భావిస్తున్నారు స్థానికులు
ఇనుగుర్తి నుంచి తొర్రూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.