నిలిపి ఉన్న కారులో మంటలు

జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద నిజామాబాద్ జాతీయ రహదారిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భూస రామచంద్రం అనే వ్యక్తి తన కొడుకు నివాసం ఉండే పురాణిపేటకు కారులో వచ్చాడు. బీట్ బజార్ చౌరస్తా వద్ద పార్కింగ్ చేసి వెళ్ళాడు. కాసేపటికే ప్రమాదవశాత్తు కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే మట్టి, నీళ్లతో మంటలు ఆర్పివేశారు. కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.