శంషాబాద్ పరిధిలోని కొత్వాల్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధమైంది. ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కిందికి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. నిముషాల్లోనే కారు పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. ఈ ఘటనతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ALSOREAD: సూర్యాపేట జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదానికి గురైన కారు ఎవరిదనేది తెలియాల్సి ఉంది.