ఎల్బీనగర్‎లో బీభత్సం.. బైక్‎ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు

ఎల్బీనగర్‎లో బీభత్సం.. బైక్‎ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన కారు

హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సూరాబాద్‎లో కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో కారు ర్యాష్  డ్రైవింగ్ చేస్తూ  ఓ బైక్‎ను ఢీకొట్టాడు. కారు ఆపకుండా బైక్‎ను అలాగే ఈడ్చుకెళ్తు ముందున్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో దివాన్స్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయాల పాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 

ప్రమాదంలో కారు, బైక్ ధ్వంసం అయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన ప్రభాకర్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నగర వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‎ టెస్టులు నిర్వహిస్తోన్న కొందరు మద్యం మత్తులో డ్రైవ్ చేసి  ప్రమాదాలకు కారణం అవుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలు తీస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ALSO READ | మినీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. నలుగురు ఉద్యోగులు సజీవ దహనం