కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జనవరి 28వ తేదీ తెల్లవారుజామున తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా జరిగింది. జిల్లా కడయనల్లూరు సమీపంలోని సేలం- వృద్ధా చలం జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు, సిమెంట్ లోడ్ తో వస్తున్న లారీ అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను తెన్‌కాసి జిల్లా పులియంగుడికి చెందిన ఆరుగురు స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. జనవరి 27వ తేదీ శనివారం నిన్న రాత్రి కారులో కుర్దాలం వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.