హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న వాహనాన్ని  ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి రేవారి ప్రాంతంలో జరిగింది.  మసాని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో కొందురు రోడ్డు ప్రక్కన వాహనం టైరు మారుస్తుండగా వేగంగా దూసుకొచ్చి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టి బోల్తా కొట్టింది. 

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. బాధితులు.. ఢిల్లీలోని కథు విలేజ్ నుంచి కారులో వస్తుంగ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.