మద్యం మత్తులో యువకుల డ్రైవింగ్.. నుజ్జు నుజ్జైన కారు

జగిత్యాల జిల్లా కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. జగిత్యాల టౌన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం దగ్గర అర్థ రాత్రి ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో నలుగురు యువకులు వేగంగా కారు నడిపారు. దీంతో కారు అదుపు తప్పి సూపర్ మార్కెట్ ముందు పార్కింగ్ చేసి ఉన్న రెండు స్కూటిలను ఢీ కొట్టింది. తర్వాత పక్కనే ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు యువకుల్లో ఇద్దరికి కాళ్లు విరిగాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో..హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. 

 కారు బీభత్సంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు...ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  కారులో బీర్ సీసాలు ఉన్నట్టు గుర్తించారు.