- గుర్తు తెలియని వ్యక్తి మృతి
జీడిమెట్ల, వెలుగు: రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని కారు ఈడ్చుకెళ్లడంతో చనిపోయాడు. సూరారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం సాయిబాబా చౌరస్తా వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి నిద్రిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఓ కారు అతన్ని ఢీకొట్టి సుమారు కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఢీకొట్టిన కారు డ్రైవర్పారిపోయాడు. సూరారం పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఏపీ 10 బీఎఫ్ 9392 కారు ఢీ కొట్టినట్లు తేలింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.