
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ, నిరుద్యోగ మహిళలు, యువతులకు సిద్దిపేట పోలీస్ , నాబార్డ్, యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తామని సీపీ. ఎన్. శ్వేత తెలిపారు. 45 రోజుల పాటు శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుందని చెప్పారు.
శిక్షణ పూర్తయిన తరువాత మహిళలకు, యువతులకు క్యాబ్ కొనుక్కోవడానికి, డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి యూనియన్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన వారు సీపీ ఆఫీస్లో స్పెషల్ బ్రాంచ్ లో 24 వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవాలి, లేదా ఫోన్ నెంబర్ కు 8712667380 ఫోన్ చేయాలని సూచించారు.