వరంగల్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. పర్వతగిరి మండలం కొంకపాక శివారులోని ఎస్సారెస్పీ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ముగ్గురు గల్లంతు కాగా.. డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. కాగా.. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా.. మరోకరి జాడ తెలియలేదు. చనిపోయిన వారిలో గుంటూరు పల్లిలో పనిచేస్తున్న గవర్నమెంట్ టీచర్ రేణుక, వరంగల్ వినాయక ట్రేడర్స్ ఓనర్ శ్రీధర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఘటనపట్ల స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
For More News..