
ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ రోడ్ నంబర్ 6 వద్ద మారుతి షిఫ్ట్ (AP 09BJ 2366) కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి....ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును పక్కకు ఆపాడు. వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.
జనగామ నుండి వచ్చిన కుటుంబ సభ్యులను ఉప్పల్ రింగ్ రోడ్డులో ఎక్కించుకొని వారసిగూడకు నాగరాజు అనే వ్యక్తి వెళుతున్నారు. హబ్సీగూడకు కారు రావడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో... అక్కడే ఉన్న పోలీసులు డోర్లు ఓపెన్ చేసి నాగరాజు అతని ఫ్యామిలీని కాపాడారు...సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలను ఆర్పారు.