రోడ్డు ప్రమాదం.. తండ్రీకూతురు మృతి.. అల్లుడి పరిస్థతి విషమం

మహబూబాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటప తోరూర్ మండలం నాంచారి మడూర్ గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో 2023, అక్టోబర్ 22వ తేదీన తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం వరంగల్ హాస్పిటల్ కు తరలించారు. మృతులను మొరిపిరాల గ్రామనికి చెందిన ఓరుగంటి వెంకన్న, ఆయన కూతురుగా పోలీసులు గుర్తించారు. అల్లుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో కారు డ్రైవర్ ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.