మాదాపూర్​లో కారు బీభత్సం.. ఓవర్ ​స్పీడ్​తో డివైడర్​ను ఢీకొట్టి పల్టీ

మాదాపూర్​లో కారు బీభత్సం.. ఓవర్ ​స్పీడ్​తో డివైడర్​ను ఢీకొట్టి పల్టీ

మాదాపూర్, వెలుగు: మాదాపూర్​లో కారు బీభత్సం సృష్టించింది. ఓవర్​స్పీడ్​తో డివైడర్ ను ఢీకొట్టి పల్టీకొట్టింది. సోమవారం తెల్లవారుజామున సైబర్​టవర్స్​నుంచి జూబ్లీహిల్స్​వైపు వెళ్తున్న స్కోడా కారు వేగంగా దూసుకొచ్చి, మెట్రో పిల్లర్​1710 వద్ద డివైడర్​ను ఢీ కొట్టింది. ఎయిర్​బెలూన్స్ ఓపెన్​కావడంతో కారులో ఉన్న ఇద్దరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

సమాచారం అందుకున్న మాదాపూర్​పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవ్ చేస్తున్న రాహుల్​కుమార్​కు డ్రంక్​అండ్​డ్రైవ్​పరీక్షలు చేయగా, మద్యం సేవించినట్లు తేలింది. అయితే, తాను మద్యం తాగలేదని, తనతో పాటు కారులో వచ్చిన ఫ్రెండ్స్​మద్యం తాగారని, ప్రమాదం తర్వాత వారు వెళ్లిపోయారని రాహుల్​కుమార్​తెలిపినట్లు పోలీసులు తెలిపారు. కారును పీఎస్​కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.