పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పండగపూట విషాదం జరిగింది. గాంధీ నగర్ లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చనిపోగా.. మరో ముగ్గురికీ గాయాలు అయ్యాయి. వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు.
మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులు గోదావరి ఖనిలోని హనుమాన్ నగర్ కు చెందిన సతీశ్ అనే సింగరేణి కార్మికుడు, ఆయన కొడుకు సాత్విక్ చనిపోయారు. సతీశ్ భార్య.. అక్క, బావలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.