హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. జులై 30వ తేదీ ఆదివారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన కారు.. అదుపు తప్పి హుస్సేన్ సాగర్ రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయింది. ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కారులోని బెలూన్ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారులో ఉన్న యువకులు ఫుల్ గా మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును వదలి పరార్ అయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.