టిప్పర్ ను ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి,  నలుగురికి గాయాలు

టిప్పర్ ను ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి,  నలుగురికి గాయాలు
  • మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం పెద్ద గోపాల్ పూర్ వద్ద ఘటన

చిన్నచింతకుంట, వెలుగు : ముందు వెళ్తున్న వెహికల్‌‌‌‌ను ఓవర్  టేక్  చేయబోయిన కారు ఎదురుగా వస్తున్న టిప్పర్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌‌‌‌నగర్  జిల్లా దేవరకద్ర ఎస్‌‌‌‌ఐ నాగన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటకకు చెందిన కొందరు ప్రయాణికులు కారులో  రాయచూర్​ వైపు వెళ్తుండగా.. దేవరకద్ర మండలం పెద్ద గోపాల్ పూర్ వద్ద ముందు వెళ్తున్న వెహికిల్‌‌‌‌ను ఓవర్  టేక్  చేయబోయారు. ఈ క్రమంలో ఎదురుగా శక్తి నగర్​ నుంచి బొగ్గు లోడుతో మహబూబ్​నగర్​ వైపు వస్తున్న టిప్పర్​ను ఢీ కొట్టారు.

ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఉన్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, డ్రైవర్​ కారులో ఇరుక్కుపోయాడు. మరో ఐదురుగు తీవ్రంగా గాయపడగా.. వారిని 108లో మహబూబ్​నగర్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బస్వరాజ్(48), జంగమూర్తి (44) చనిపోయారు. ఎస్సై సిబ్బందితో కలిసి స్పాట్​కు చేరుకొని స్థానికుల సాయంతో కారులో ఇరుక్కున్న డ్రైవర్​ను బయటకు తీశారు. ట్రాఫిక్​ జామ్​ కావడంతో జేసీబీతో కారును పక్కకు పెట్టించి ట్రాఫిక్​ను పునరుద్ధరించారు.