
- ఐదుగురికి గాయాలు
- కీసర పీఎస్ పరిధిలో ఘటన
కీసర, వెలుగు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా.. ఓ వ్యక్తి చనిపోయాడు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన కీసర పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున హనుమకొండ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఓ కారు కీసర మండలంలోని యాద్గిరిపల్లి చౌరస్తాలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ప్రమాదంలో అజయ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో ఐదుగురిని పోలీసులు హాస్పిటల్కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.