
హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర జనవరి 25న తెల్లవారుజామున ఫుట్ పాత్ మీదకు దుసుకెళ్లింది కారు. ఈ ఘటనలో ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కారును అక్కడే వదిలిపెట్టి పారిపోయారు కారులోని వ్యక్తులు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.