దేశంలో కార్ల అమ్మకాలు అత్యంత దారుణంగా పడిపోయాయి.. ఏ రేంజ్ లో అంటే 2024, సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 20 శాతం సేల్స్ తగ్గాయి.. దీంతో దేశ వ్యాప్తంగా గోదాముల్లో అమ్ముడుపోని కార్ల సంఖ్య 8 లక్షలకు చేరింది.. ఇది ఇండియా చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్.. అన్ని కంపెనీల కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయని.. అమ్ముడుపోని కార్ల విలువ 80 వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
డీలర్ల గోదాముల్లో పేరుకుపోయిన కొత్త సంఖ్య 8 లక్షలకు చేరుకోగా.. వీటిని అమ్మటానికి పట్టే సమయం ఎంతో తెలుసా.. ఏకంగా 85 రోజులు.. అంటే మూడు నెలల సమయం పడుతుంది. అది కూడా మార్కెట్ బాగుంటే.. సేల్స్ బాగుంటేనే.. ప్రస్తుతం మార్కెట్ సిట్యువేషన్ వేరుగా ఉంది.. కార్ల కొనుగోలుపై మధ్యతరగతి ప్రజలు ముందుకు రావటం లేదు. ఈ క్రమంలోనే రోజు రోజుకు కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే అమ్ముడుపోని కార్ల సంఖ్య ఏకంగా 2 లక్షల 75 వేల 681గా ఉంది.
దసరా పండుగ సీజన్ నడుస్తుంది. అన్ని కార్ల కంపెనీలు ఆఫర్స్ ప్రకటించాయి. డిస్కొంట్స్ ఇస్తున్నాయి. అయినా సేల్స్ మాత్రం పెరగటం లేదు. మొన్నటి వరకు భారీ వర్షాలు, వరదలు, పితృమాసం కారణంగా సేల్స్ లేవంటూ.. తమకు తాము సర్ధిచెప్పుకున్న కంపెనీలు.. ఇప్పుడు అంతా సర్దుకున్నా.. దసరా పండుగ సీజన్ వచ్చి వారం రోజులు అవుతున్నా.. సేల్స్ పుంజుకోకపోవటంతో ఆందోళనలో ఉన్నాయి కార్ల తయారీ కంపెనీలు.
Also Read :- కొత్త ప్లాన్ తెచ్చిన ఎల్ఐసీ
దేశంలో గణేష్ ఉత్సవాలు, కేరళలో ఓనం పండుగ సందర్భాల్లోనూ కార్ల అమ్మకాలు పెరగలేదని డీలర్లు చెబుతున్నారు. 2024, సెప్టెంబర్ నెలలోనే.. ఆయా కార్ల తయారీ కంపెనీలు.. హోల్ సేల్ డీలర్లకు 3 లక్షల 60 వేల కార్లను డెలవరీ చేయగా.. వాటిలో 80 వేల కార్లు ఇంకా గోదాముల్లోనే ఉన్నాయి. రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవటంతో.. గతంలో పంపిన కార్లు అమ్ముడుపోకుండా ఉండటంతో.. రిటైలర్ల నుంచి ఎలాంటి డిమాండ్ లేదని చెబుతున్నారు డీలర్స్ అసోసియేషన్.
దేశవ్యాప్తంగా హోల్ సేల్ డీలర్ల దగ్గర.. ఆయా కార్ల కంపెనీల దగ్గర అమ్ముడుపోని కొత్త కార్లు ఏకంగా 8 లక్షలకు చేరుకోవటం.. వాటి విలువ ఏకంగా 79 వేల కోట్ల రూపాయలుగా ఉండటం చూస్తుంటే.. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎంత సంక్షోభంలో ఉందో అర్థం అవుతుంది. దసరా సీజన్ కూడా మరో వారం ముగుస్తుంది.. 2024 ఏడాదిలో ఇక మిగిలిన పండుగలు దీపావళి, క్రిస్మస్ మాత్రమే.. రాబోయే సంక్రాంతి సీజన్.. ఆ మూడు పండుగలపైనే ఆశలు పెట్టుకున్నాయి కార్ల కంపెనీలు.