కార్ల అమ్మకాలు ఒక్కసారిగా తగ్గాయి.సెప్టెంబర్ లో రిటైల్ కార్ల అమ్మకాలు దాదాపు 20 శాతం పైగా పడిపోయాయి. అయితే డీలర్ షిప్ లు ఆల్ టైమ్ హై ఇన్వెంటరీతో నిండిపోయాయి. దీనికి కారణం అమ్మకాలు మందగించినప్పటికీ కార్ మేకర్లు పండగ సీజన్ కు ముందు డిస్పాచ్ లు పెరుగుతూనే ఉన్నాయి.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ సోమవారం ( అక్టోబకర్ 07) విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుతం 79వేల కోట్ల విలువైన 7.9 లక్షల కార్లు డీలర్ల వద్ద ఉన్నాయి. ఇది 80నుంచి 85 రోజుల పాటు అమ్ముడుపోని స్టాక్ తో సమానం. సెప్టెంబర్ లో రిటైల్ కార్ల అమ్మకాలు 18.81 శాతం క్షీణించి 2లక్షల 75వేల 681 యూనిట్లకు చేరుకున్నాయి.
Also Read : రూ.17,600 కోట్లు సేకరించనున్న అనిల్ అంబానీ కంపెనీలు
- 2వీలర్ అమ్మకాలు 8.51 శాతం తగ్గి 12లక్షల 4వేల 259 యూనిట్లకు చేరుకున్నాయి.
- 3వీలర్ అమ్మకాలు 0.66శాతం వృద్ధితో లక్షా 6వేల 524 యూనిట్లకు చేరుకున్నాయి.
- కమర్షియల్ వెహికల్స్ 10.45 శాతం తగ్గి 74వేల 324 యూనిట్లకు చేరుకున్నాయి.
అక్టోబర్ 1 విడుదల చేసిన అంచనాలు, హోల్ సేల్ గణాం కాల ప్రకారం.. కార్ల తయారీ దారులు సెప్టెంబర్ నెలలో 3.55 నుంచి 3.60 లక్షల యూనిట్లను డీలర్ షిప్ లకు పంపారు. ఇది ఒక్క నెలలో నే హోల్స్ సేల్స్ , రిటైల్ ల మధ్య 80వేల యూనిట్ల కంటే ఎక్కువ.