సినిమా తరహాలో తొమ్మిది పల్టీలు కొట్టిన కారు..

 సినిమా తరహాలో తొమ్మిది పల్టీలు కొట్టిన కారు..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు వెళ్తున్న కారు..ముందు వెళ్తున్న ఆర్టీసి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ... స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో పల్టీలు కొట్టింది. దాదాపు తొమ్మిది సార్లు ఫల్టీలు కొట్టింది. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు ఎగిరి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. మరొకరు కారుకింద పడి చనిపోయారు. 

 ఇక కారు బోల్తా పడినప్పుడు ముందు బైకుపై వెళ్తున్న ఇద్దరికి తృటిలో ప్రమాదం తప్పింది. కాస్త బైక్ వేగం తగ్గినా వారిద్దరూ చనిపోయే ప్రమాదంగానే ఉంది.  ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో  రికార్డ్ అయ్యింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

యాక్సిడెంట్ లో చనిపోయిన యువకుడిని యశ్వంత్ గా గుర్తించారు. గాయపడిన అజయ్, వెంకటేష్,అఖిల్ ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వీరంత హుస్నాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు.  విషయం తెలుసుకున్న యువకుల బంధువులు, కుటుంభ సభ్యులు రోదిస్తున్నారు.