
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని అల్లాదుర్గ్ మండలం గడి పెద్దాపూర్ వద్ద జాతీయ రహాదారి 161పై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యభర్తలు మృ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తుండగా జాతీయ రహాదారిపై కారు అదుపుతప్పి బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. మృతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు నారాయణ, దేవమణీలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.