చిత్తూరు జిల్లాలో అదుపుతప్పి కారు బోల్తా..

చిత్తూరు : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో తమిళనాడుకు చెందిన కారు వేగంగా వెళ్తూ.. అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఎస్ఆర్ పురం మండలం క్షీర సముద్రం వద్ద జరిగిందీ ఘటన. గుడియాత్తంకు చెందిన కారులో డ్రైవర్ తోపాటు తొమ్మిది మంది ఉన్నారు. వీరందరూ గాయపడగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. శనివారం ఉదయం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి స్వామి వారిని  దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా కారు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.