
గండిపేట, వెలుగు: ఆరాంఘర్వైపు వెళ్తున్న కారును పీవీఎన్ఆర్ఎక్స్ ప్రెస్వేపై వెనుకగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఆ వేగానికి ముందు వెళ్తున్న కారు పల్టీకొట్టింది. ఫ్లైఓవర్ సైడ్ వాల్ ను ఢీకొని ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం (ఏప్రిల్ 29) ఉదయం మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న రెండు కార్లు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్280 వద్ద ఢీకొన్నాయి.
ముందు కారు పల్టీకొట్టి.. ఫ్లైఓవర్సైడ్వాల్ ను ఢీకొని ఆగింది. కారులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వేపై నిలిచిన ట్రాఫిక్ ను క్లియర్‌చేశారు.