నన్నే చలానా అడుగుతావా.. ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ.. పంజాగుట్టలో కారు ఓనర్ హల్చల్

నన్నే చలానా అడుగుతావా.. ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ.. పంజాగుట్టలో కారు ఓనర్ హల్చల్

హైదరాబాద్ పంజాగుట్టలో ఓ కారు ఓనర్ హల్చల్ చేశాడు. కారు పెండింగ్ చలానా చెల్లించాలని అడిగిన ట్రాఫిక్ పోలీసుల మీద చిందులు వేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తో పాటు ఎస్సై తో వాగ్వాదానికి దిగాడు. 

 ‘‘ నాలుగు వేల పెండిగ్ చలానా కోసం నన్నే ఆపుతావా.. ఎన్ని గుండెలు నీకు.. నా ఇంట్లో ఉన్న కారుపై 16 వేల రూపాయల పెండింగ్ చలానా ఉంది. ఇప్పటి వరకు నన్ను ఎవరూ అడగలేదు. రెండు నిమిషాల్లో ట్రాన్స్ ఫర్ చేయిస్తా’’ అని ట్రాఫిక్ ఎస్సై మోజీరామ్ పై చిందులు వేశాడు. 

Also Read:-ఇలాంటి హోటల్స్లో ఇలాంటి ఇడ్లీ తింటే క్యాన్సర్ గ్యారెంటీ..!

పంజాగుట్ట మెర్క్యూర్ హోటల్ ముందు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా న్యూసెన్స్ కు దిగిన కార్ ఓనర్ కు ఓపికతో సమాధానం చెప్పిన పోలీసులు.. కారులో ఉన్న ఇద్దరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.