బషీరాబాద్​పరిధిలో పార్క్​ చేసిన కారు దగ్ధం

జీడిమెట్ల, వెలుగు: పేట్ బషీరాబాద్​పరిధిలో పార్కు చేసిన కారును గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. భాగ్యలక్ష్మీకాలనీలో కొన్ని రోజులుగా రోడ్డుపై మారుతీ కారును ఒక వ్యక్తి పార్క్ ​చేసి వెళ్లాడు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ కారుకు నిప్పుపెట్టి తగలబెట్టారు. 

దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, కారు ఓనర్ ఎవరన్నది తమకు తెలియదని స్థానికులు తెలిపారు.