- వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఘటన
నర్సంపేట, వెలుగు : కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఓ ఏఈవో చనిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు వద్ద బుధవారం జరిగింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన మిరియాల విష్ణు (28) స్థానికంగా ఏఈవోగా పనిచేస్తున్నాడు.
బుధవారం తన ఫ్రెండ్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి మరో ఫ్రెండ్ పెండ్లి కోసం నర్సంపేటకు వచ్చారు. పెండ్లి పూర్తయ్యాక కారు సమీపంలోని కమలాపురం మాదన్నపేట చెరువు వద్దకు వెళ్లారు. చెరువు మత్తడి సమీపంలో కారు అదుపు తప్పి నీటిలోకి దూసుకుపోయింది.
ప్రమాదాన్ని గుర్తించిన ప్రేమ్‌కుమార్ కారులో నుంచి దూకగా కారును డ్రైవ్ చేస్తున్న విష్ణు అందులోనే ఇరుక్కుపోయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న నర్సంపేట పట్టణ సీఐ రమణమూర్తి, ఎస్సైలు శీలం రవి, అరుణ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును, ఏఈవో విష్ణును చెరువులోంచి బయటకు తీశారు.