డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు

డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు

వరంగల్ జిల్లా  పర్వతగిరి మండలం కొంకపాక శివారు సమీపంలోని  ఎస్సారెస్పీ కెనాల్ లో  కారు పడిన ఘటనలోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.  మృతులు మహబూబాబాద్ జిల్లా  ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు  ప్రవీణ్ కుటుంబ సభ్యులుగా  గుర్తించారు పోలీసులు.  

హనుమకొండలో  నివాసం ఉంటూ  ఎల్ ఐసీలో డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు సోమారపు ప్రవీణ్. మార్చి 8న ఉదయం ప్రవీణ్ తన తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి,కుమారుడు హర్షవర్దన్ తో కలిసి హనమకొండ నుంచి స్వగ్రామానికి  కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో కారు డ్రైవ్ చేస్తున్న ప్రవీణ్ కు  గుండెపోటు రాగా..చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లింది.   కారుతో సహా ప్రవీణ్, చైత్ర సాయి(4) సాయి సాయివర్ధన్ (2 ) గల్లంతు కాగా భార్య కృష్ణ వేణిని స్థానికులు  ప్రాణాలతో కాపాడారు. గల్లంతైన ముగ్గురు తండ్రీ కొడుకు కూతురు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.