- హైదరాబాద్‌లో నయా బిజినెస్
- నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల తరలింపు
- యథేచ్ఛగా తిరుగుతున్న నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు
- ఎల్లో నంబర్ ప్లేట్ , కమర్షియల్ లైసెన్స్ ఉండవు
- చోద్యం చూస్తున్న ఆర్టీఏ ఉన్నతాధికారులు
హైదరాబాద్‌లో ఓ ఉద్యోగి హయత్ నగర్ నుంచి గచ్చిబౌలిలోని తన ఆఫీస్ కు వెళ్లాలి. అతడు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వగానే ఉబర్ యాప్ ఆన్ చేస్తాడు. మధ్యలో మలక్ పేటలో ఒకరిని, కోఠిలో మరొకరిని ఎక్కించుకుంటాడు.వారిని గచ్చిబౌలి రూట్లలో దింపుతాడు. వారి నుంచి డబ్బులు తీసుకుని, ఉబర్‌కు కమీషన్ కొంత ఇచ్చిమిగతాది ఉంచేసుకుంటాడు. దీన్నే కార్‌పూలింగ్ అంటారు. అయితే ఇవన్నీ నాన్‌ట్రాన్స్ పోర్ట్ వాహనాలు. ఇందులో ఇలా డబ్బులు తీసుకుని ప్రయాణికులను రవాణా చేయకూడదు.కానీ ఇప్పుడు సిటీలో అంతా ఇలాగే నడుస్తోంది.
క్యాబ్ సంస్థలు నిబంధనలను బేఖాతర్ చేస్తున్నాయి. మోటార్ వెహికల్ చట్టాలను పట్టించుకోకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా కారు పూలింగ్ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతోపాటు, అటు డ్రైవర్ల ఉపాధిపైనా దెబ్బ పడుతోంది.
రోజూ 4 వేల కార్లు
జర్నీని షేర్ చేసుకోవడమే కార్‌పూలింగ్ .యూరప్ లో ఎప్పటినుంచో ఉన్న ఈ విధానాన్ని ఇటీవలే హైదరాబాద్ లో అమల్లోకి తీసుకొచ్చారు. నగరంలోని లింగంపల్లి, మియాపూర్ , నిజాంపేట్ ,కూకట్ పల్లి, ఎస్ ఆర్ నగర్ , వెంగళరావ్ నగర్ ,అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ , యూసుఫ్ గూడ, శ్రీనగర్ కా లనీ, జూబ్లీ హిల్స్ , మాదాపూర్ , హైటెక్ సిటీ, కొండాపూర్ ,గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్ రూట్లలో ఉబర్‌యాప్ లో కార్ పూలింగ్ కు అవకాశం ఉంది. నిత్యం సుమారు నాలుగు వేల వరకు పూలింగ్ కార్లు తిరుగుతున్నాయి. వీటిలో 10 వేల మందివరకు ప్రయాణిస్తున్నారు. ఇవి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుడి నుంచి కిలో మీటరుకు రూ.8 చొప్పున తీసుకుంటున్నారు. సగటున ఒక్కో ప్రయాణికుడు 2.5 కిలోమీటర్ల వరకు తిరుగుతుండగా, వారి దగ్గర సగటున రూ.40 వరకు తీసుకుంటున్నారు.
నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలతో
మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ట్రాన్స్ పోర్ట్ వాహనానికి ఎల్లో నంబర్ ప్లేట్ ఉండాలి. నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు వైట్ ప్లేట్ ఉండాలి. ప్రయాణికులను ఎక్కిం చుకోవాలంటే కమర్షియల్ నంబర్ ప్లే ట్ తప్పనిసరి. మామూలుగా ఎవరైనా వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చినా ట్రాన్స్ పోర్ట్ నంబర్ ప్లే ట్ లేకపోతే దాన్ని ఆర్టీఏ అధికారులు నేరంగా పరిగణిస్తారు. కా నీ హైదరాబాద్‌లోతిరుగుతున్న కా రు పూలింగ్ వెహికిల్స్ అన్నీ నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలే. వీటిని వాడుతున్న వారికి ట్రాన్స్ పోర్ట్ డ్రైవిం గ్ లైసెన్స్ కూడా ఉండదు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
సాధారణంగా నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు 15 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఫిట్ నెస్ కు వెళ్లాలి. అదే ట్రాన్స్ పోర్ట్ వాహనాలను ప్రతి రెండేళ్లకోసారి తప్పనిసరిగా ఫిట్ నెస్ కు తీసుకెళ్లాలి. నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఇన్సూరెన్స్ రూ.8–10 వేలు ఉంటుంది. కానీ ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ కు 25 వేలకు పైనే ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు ట్యాక్స్‌కూడా ఎక్కువే. కానీ ఇవేవీ కట్టకుండా దర్జా గా పని కానిచ్చేస్తు న్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోం ది. మరోవైపు కారు పూలింగ్ విధానంతో డ్రైవర్ల ఉపాధిపైనా దెబ్బ పడుతోంది. గతంలో ఐటీ కంపెనీలు ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అద్దెకు తీసుకుని, ఉద్యోగులను తీసుకొచ్చేవి. ప్రస్తుతం ఉద్యోగులు ఆయా సొంత సంస్థలతో మాట్లాడి కారుపూలింగ్ బిల్లులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగం ఉన్న వారికి కారు పూలిం గ్ ద్వారా మరింత ఆదాయం సమకూరుతోం దని, తమ పొట్ట కొడుతున్నారని డ్రైవర్లు వాపోతున్నారు.