నగర శివారులో కుర్రాళ్లు కార్ల రేసింగ్ తో రెచ్చిపోతున్నారు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ లో కొందరు యువకులు కార్ రేసింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఆగస్టు 15న సెలవు కావడంతో అనంతగిరి హిల్స్ లో సైరన్ వేసుకుంటూ కార్లు, బైక్ లతో స్టంట్స్ చేసి అలజడి సృష్టించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రేసింగ్ లతో టూరిస్టులను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు.
ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీకెండ్స్ లో రెగ్యులర్ గా కార్ రేసింగ్ జరుగుతున్నాయంటూ పోస్ట్ చేశారు. కార్ రేసింగ్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వికారబాద్ కొండలు చూడదగ్గ ప్రాంతం కాబట్టి చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళుతుంటారు. బైక్ ,కార్ రేసింగ్ పోటీలతో సందర్శకులు భయపడుతున్నారు.