- పెద్దపల్లి శివారులో ఘటన
పెద్దపల్లి: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో నిన్న అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుంచి పెద్ద కలువలకు వెళ్తున్న టీఎస్ 10 ఈఎల్ 2029 అనే నంబర్ గల నెక్సా కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్లింది. ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు.
కారులో ఉన్న గాదె అఖిల్, అల్లం బాల అనురోహిత్ రెడ్డి, సాయిలు బావిలో నుంచి పైపు ద్వారా బయటికి వచ్చి క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.