
- ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- మెదక్ జిల్లా రెడ్డిపల్లిలో దారుణం
మెదక్ (చేగుంట), వెలుగు : మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో గురువారం పాత కక్షలతో పెండ్లి బృందాన్ని కారుతో ఢీకొట్టగా ఒకరు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ పెండ్లి గురువారం జరిగింది. సాయంత్రం కుటుంబసభ్యులు పెండ్లి కూతురు అప్పగింతలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అదే టైంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్ కారుతో స్పీడ్ గా వీరి మీదకు దూసుకొచ్చాడు. దీంతో ఉప్పు రమ్య, దుర్గయ్య, సంపంగి యాదగిరి, సుజాత, బబ్లు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రమ్య, దుర్గయ్యలను హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తుండగా రమ్య చనిపోయింది. ఉప్పు వెంకటితో ఉన్న భూతగాదాల నేపథ్యంలోనే నరేందర్ పెండ్లి బృందాన్ని కారుతో ఢీకొట్టాడని స్థానికులు తెలిపారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.