హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది.. మేడిపల్లిలో శుక్రవారం ( జనవరి 31, 2025 ) అర్థరాత్రి కారు సృష్టించిన బీభత్సానికి నాలుగేళ్ళ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఐఆర్ సాయిప్రియ రోడ్ శుక్రవారం అర్ధరాత్రి తప్పతాగి కారుతో బీభత్సం సృష్టించాడు డ్రైవర్. కారు వేగంగా వచ్చి రోడ్డుకు పక్కనే ఉన్న వాచ్మెన్ గుడిసెలోకి దూసుకెళ్లింది.
Also Read :- యూపీలో అగ్నిప్రమాదం..గ్యాస్ సిలిండర్ల ట్రక్కులో పేలుడు
ఈ ఘటనలో నాలుగేళ్ళ బాలుడు మృతి చెండాడు.ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.