చెట్టు కూలి ఆటో ధ్వంసం

  • డ్రైవర్​కు తప్పిన ప్రాణాపాయం

బషీర్ బాగ్, వెలుగు : సెక్రటేరియట్ వెనక మింట్ కాంపౌండ్​లోని రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటోపై చెట్టు పడడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎల్బీనగర్​కు చెందిన సదరు ఆటో డ్రైవర్ షేక్ జానీకి ప్రాణాపాయం తప్పింది.

ఆయన తల, చేతికి గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్​కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని చెట్టుకు పక్కకు తొలగించి, ట్రాఫిక్​ను​ క్లియర్ చేశారు.