భవిష్యత్తుపై ఎన్నో ఆశలు.. ఎన్నో ఆకాంక్షలు..వ్యవసాయ కుటుంబం నుంచి శాస్త్రవేత్తగా ఎదిగింది.. పదిమందికి అన్నం పెట్టే శాస్త్రవేత్తగా రాణించాలని రేయింబ వళ్లు కష్టపడింది..అనుకున్న స్థాయికి చేరువలో ఉంది..ఇంతలో..అనుకోని సంఘటన..ఆమె కన్నకలలను చుట్టుముట్టిన వరదనీటిలో తుడిచిపెట్టుకుపోయాయి. మహబూబాబాద్ జిల్లా ఆకేరు వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయిన ప్రమాదంలో మరణించిన అశ్విని విషాద గాధ..
తండ్రి మోతీలాల్ లో కలిసి కారులో వెళ్తున్న అశ్వినీ.. ఆకేరు వాగు వరద ఉధృతికి బలైంది. చుట్టుముట్టిన వరద నీరు కారును ముంచేశాయి. మృత్యువు ముంచు కొస్తున్నపుడు అశ్విని బంధువులకు ఫోన్ చేసిన కన్నీ పర్యంతం అయింది. అయినా జరగాల్సిందంతా జరిగిపోయింది. వరదలో కొట్టుకుపోయి ఓ చెట్టుకు చిక్కుని శవమై కనిపించింది. తండ్రీ జాడ ఇంకా తెలియలేదు.
ALSO READ |వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన తండ్రీకూతురు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారాం తండా చెందిన అశ్వినీ.. డిగ్రీ , పీజీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అశ్వినీ పట్టుదల తో.. ఉన్నత శిఖరాలకు ఎదిగింది. అశ్వారావు పేట వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ చ దివిన ఆమె.. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లో సైంటిస్ట్ గా ఎంపి కైంది. ప్రస్తుతం ఇక్రిశాట్ లో పీహెచ్ డీ చేస్తోంది. జాతీయ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్త రిక్రూట్ మెంట్ బోర్డులో జాతీయ స్థాయిలో మొదటి భహుమతి పొందింది అశ్విని.
ఉన్నత లక్ష్యంతో పదిమంది అన్నం పెట్టే యువ సైంటిస్ట్ ఎదుగుతున్న సమయంలో ఆకేరు వరద లో చిక్కుకొని బలికావడంతో అశ్వినీ కుటుంబ సభ్యులు గుండె లు పగిలేలా ఏడ్చారు. అశ్వినీ తండ్రి జాడ ఇంకా తెలియలేదు.. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో అశ్వినీ సొంత గ్రామం గంగారాం తండాతో విషాద ఛాయలు అలముకొన్నాయి.