బతుకమ్మ కుంటలోకి దూసుకెళ్లిన కారు

బతుకమ్మ కుంటలోకి దూసుకెళ్లిన కారు

జనగామ అర్బన్, వెలుగు :  జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలోకి ఓ కారు ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది.  జనగామకు చెందిన ఇద్దరు యువకులు శుక్రవారం సాయంత్రం  డ్రైవింగ్​ నేర్చుకునేందుకు బతుకమ్మ కుంట వద్ద కారును నడుపుతుండగా అదుపు తప్పి నీటిలోకి దూసుకెళ్లింది.  

దీంతో అక్కడే వాకింగ్​ చేస్తున్నవారు అప్రమత్తమై వారిని కారులోంచి బయటికి దూకాలని చెప్పడంతో వారు కారు అద్దాలు దించుకొని నీళ్లలో దూకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు  రావడంతో ప్రాణపాయం తప్పింది.