వ్యాపారులు కార్డు పేమెంట్లను కూడా తీసుకునేందుకు వీలుగా ‘కార్డ్ సౌండ్‌బాక్స్’ ను పేటీఎం తీసుకొచ్చింది. వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే వంటి కార్డులను పేటీఎం సౌండ్ బాక్స్ దగ్గర ట్యాప్ చేసి పే చేయొచ్చు.
అంతేకాకుండా మొబైల్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సాధారణ యూపీఐ పేమెంట్లు కూడా జరుపుకోవచ్చు. మరోవైపు పైన్ ల్యాబ్స్ కూడా క్యూఆర్, కార్డ్ పేమెంట్ల కోసం ‘మిని’ పేరుతో ఓ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) లాంచ్ చేసింది. సాధారణ పీఓఎస్‌తో పోలిస్తే దీని ధర 75 శాతం తక్కువ ఉంటుందని కంపెనీ పేర్కొంది.