
చెన్నూరు, వెలుగు : ఓ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంట్లో పేకాట ఆడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, కౌన్సిలర్ పరారీలో ఉన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం బేతాళవాడలోని బీఆర్‌ఎస్ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ ఇంట్లో కొందరు వ్యక్తులు ఆదివారం పేకాట ఆడుతున్నారు.
పోలీసులకు సమాచారం అందడంతో చెన్నూర్ టౌన్ సీఐ సిబ్బందితో కలిసి కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు. మారెమ్మవాడకు చెందిన గడిపెల్లి సంతోష్, భీమ్ వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకోగా, కౌన్సిలర్ మహేశ్ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.6,600, పేక, రెండు బైక్‌లు, ఓ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రవీందర్ చెప్పారు.