తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు వహించాలి: దాన కిశోర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: తాగునీటి సరఫరాలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, వాటర్​లాగింగ్​పాయింట్లపై ఫోకస్​పెట్టాలని మున్సిపల్​ప్రిన్సిపల్​సెక్రటరీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సోమవారం వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీవేజ్ మేనేజ్​మెంట్, తాగునీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం, మేనేజర్‌‌లు, ఇతర సిబ్బంది  క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు.