టీ-హబ్​లో కెరీర్ గ్రోత్ సమ్మిట్

టీ-హబ్​లో కెరీర్ గ్రోత్ సమ్మిట్

హైదరాబాద్, వెలుగు: ఫ్రంట్ లైన్స్ మీడియా (ఎఫ్ఎల్ఎమ్) ఏర్పాటు చేసిన  కెరీర్ గ్రోత్ సమ్మిట్ శనివారం హైదరాబాద్‌‌‌‌లోని టీ–హబ్​లో జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్లు కెరీర్ ​గురించి అడిగిన ప్రశ్నలకు కెరీర్ కోచ్‌‌‌‌లు జవాబులు ఇచ్చారు. దాదాపు 300 మంది స్టూడెంట్లు,  కెరీర్ కోచ్‌‌‌‌లు సమ్మిట్‌‌‌‌లో పాల్గొన్నారు. క్రైసిస్​ సమయంలో కెరీర్‌‌‌‌ను ఎలా నిర్మించుకోవాలి?, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, కొత్త అవకాశాలు తదితర అంశాల గురించి వివరించారు.

ఫ్రంట్ లైన్స్ మీడియా ఫౌండర్లు సాయికృష్ణ మంత్రవాది, ఉపేంద్ర గులిపిల్లి మాట్లాడుతూ నిరుద్యోగులకు, స్టూడెంట్లకు కెరీర్​,  ఉద్యోగ అవకాశాల గురించి తెలియజే యడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తామని తెలిపారు. ఫ్రంట్‌‌‌‌లైన్ మీడియాకు ఇప్పుడు ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో   కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలిపారు. తెలుగులోనూ ట్రెండింగ్ టెక్నాలజీలన్నింటినీ వివరిస్తామని చెప్పారు.