సిడ్నీ: పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. ఇండియాతో ఐదో టెస్ట్‌కు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజే స్టార్క్ పక్కటెముకల్లో నొప్పితో పాటు వాపు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ఫిజియో సాయంతో బౌలింగ్ కంటిన్యూ చేశాడని వెల్లడించాయి.
అయితే శుక్రవారం వరకు అతను పూర్తిగా కోలుకుంటాడని వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌కు ముందు స్టార్క్ ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రానున్నారు. ఒకవేళ స్టార్క్ పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోతే అతని ప్లేస్‌లో జే రిచర్డ్‌సన్‌కు చాన్స్ ఇవ్వనున్నారు.