
- 2022 మే నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి ప్లాంట్
- దక్షిణ భారతదేశంలో వంట నూనెలను మరింత విస్తరిస్తాం: కార్గిల్
హైదరాబాద్, వెలుగు: కృష్ణపట్నం పోర్ట్ ఆయిల్ రిఫైనరీకి చెందిన నెల్లూరు (ఆంధ్రప్రదేశ్) లోని వంట నూనెల రిఫైనరీ ప్లాంట్‌ను కార్గిల్ కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 262 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వంట నూనెల ప్లాంట్‌ను మరింత విస్తరిస్తామని, దక్షిణ భారతదేశంలో వంట నూనెల డిమాండ్‌ను చేరుకుంటామని కార్గిల్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. వచ్చే ఏడాది మే నాటికి పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ పనిచేస్తుందని తెలిపింది. ‘గత కొన్నేళ్ల నుంచి వంట నూనెల వ్యాపారంలో మంచి గ్రోత్‌ను నమోదు చేస్తున్నాం. ఈ ప్లాంట్‌ను కొనడం వలన సౌత్ ఇండియాలో మరింతగా విస్తరిస్తాం. అమ్మకాలను పెంచుకుంటాం’ అని కార్గిల్ తెలిపింది.