
జన్నారం, వెలుగు: అంగన్వాడీ కేంద్రానికి సరుకులు సప్లై చేసేందుకు వచ్చిన కార్గో బస్సు కరెంట్పోల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్తంభం విరిగి బస్సుపై ఒరిగింది. జన్నారం మండలం రాంపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రానికి సరుకులు సప్లయ్చేసేందుకు సోమవారం ఉదయం వచ్చిన ఆర్టీసీకి చెందిన కార్గో బస్సు గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్న మూల మలుపు దగ్గర కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది.
దీంతో ఆ స్తంభం విరిగి బస్సుపై పడింది. ఆ సమయంలో కరెంట్ సరఫరా లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.