క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త ఇది. ఐపీఎల్ తరహాలో వెస్టిండీస్ దీవుల వేదికగా జరిగేకరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL) షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 6 జట్లు తలపడే ఈ టోర్నీ ఆగస్టు 29న ప్రారంభమై అక్టోబర్ 6న ముగియనుంది. జమైకా తల్లావాస్ జట్టు స్థానంలో కొత్తగా ఈ ఎడిషన్‌లో ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ ఏడాది సీపీఎల్ సీజన్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.
పాల్గొనే జట్లు: 6
- గయానా అమెజాన్ వారియర్స్
- ట్రిన్‌బాగో నైట్ రైడర్స్
- సెయింట్ లూసియా కింగ్స్
- ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్
- సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
- బార్బడోస్ రాయల్స్
మ్యాచ్‌లు జరిగే వేదికలు:
- సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం(ఆంటిగ్వా)
- వార్నర్ పార్క్ స్పోర్టింగ్ కాంప్లెక్స్(సెయింట్ కిట్స్)
- డారెన్ స్యామీ క్రికెట్ గ్రౌండ్(సెయింట్ లూసియా)
- కెన్సింగ్టన్ ఓవల్(బార్బడోస్)
- క్వీన్స్ పార్క్ ఓవల్(ట్రినిడాడ్)
- గయానా నేషనల్ స్టేడియం(ప్రొవిడెన్స్)
- బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ(ట్రినిడాడ్)
డబుల్-హెడర్ రోజులలో మొదటి మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు, రెండవ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. షెడ్యూల్, టైమింగ్స్, వేదికలతో కూడిన పూర్తి జాబితాను కింద చూడవచ్చు.
Breaking news 🚨 The fixtures for the 2024 Republic Bank Caribbean Premier League have been confirmed. Read more ➡️ https://t.co/vdBQlA3XFQ #CPL24 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/PNz2lZZ3qj
— CPL T20 (@CPL) April 10, 2024