ఆదివారం(జూలై 14) వింబుల్డన్ బ్లాక్ బస్టర్ ఫైనల్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ మెగా ఫైనల్లో 7సార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, డిఫెండింగ్ ఛాంప్ కార్లోస్ అల్కరాస్ తలపడనున్నారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ప్రపంచంలో ఇద్దరు టాప్ ప్లేయర్ల మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మెగా ఫైనల్ కు నెక్స్ట్ లెవల్ క్రేజ్ నెలకొంది. అయితే ఈ మ్యాచ్ స్టేడియంలో చూసేందుకు లక్షలు చెల్లించాల్సిందే.
మ్యాచ్ ఎంట్రీ టికెట్ ధరలు ఆకాశాన్ని దాటేశాయి. అత్యధికంగా టికెట్ ధర 10,600 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు రూ. 8.90 లక్షలు అన్నమాట. క్రీడా చరిత్రలో అత్యంత ఖరీదైన ఎంట్రీ టికెట్ ఇదే కావడం విశేషం. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌కు దాదాపు రూ.22 కోట్లు, రన్నరకు రూ. 12కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఆదివారం (జులై 14)న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది.
ALSO READ | భళా బార్బోరా.. వింబుల్డన్ టైటిల్ గెలిచిన క్రెజికోవా
సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్ ఇప్పటికే ఏడు వింబుల్డన్ టైటిళ్లను గెలిచాడు. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి ఎనిమిది టైటిల్‌ను కైవసం చేసుకుని 25 గ్రాండ్‌స్లామ్‌లతో టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరో వైపు 21 ఏళ్ల అల్కరాస్ ఇప్పటికే మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2023 వింబుల్డన్ జొకోవిచ్ పై నెగ్గిన అల్కరాజ్ వరుసగా రెండో సారి ఈ స్లామ్ గెలిచి రెండో వింబుల్డన్ టైటిల్ ను అదే విధంగా నాలుగో గ్రాండ్ స్లామ్ ను అందుకోవాలని చూస్తున్నాడు.
The get-in price for Sunday's Wimbledon final between Novak Djokovic and Carlos Alcaraz is currently $10,600.
— Joe Pompliano (@JoePompliano) July 12, 2024
That makes it the most expensive get-in price ever recorded for a sporting event on @TickPick.
Insanity 🤯 pic.twitter.com/BtzHOcv0Ov