
లండన్ : డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ స్టార్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్, నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో మూడోసీడ్ అల్కరాజ్ 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో ఐదోసీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై నెగ్గాడు. 2 గంటలా 55 నిమిషాల మ్యాచ్‌లో మెద్వెదెవ్‌కు బలమైన ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి సెట్‌లో నిరాశపర్చిన అల్కరాజ్ తర్వాతి మూడు సెట్లలో పవర్‌ఫుల్ గ్రౌండ్ స్ట్రోక్స్‌తో చెలరేగాడు. ప్రత్యర్థి అనుభవానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు.
కీలక టైమ్‌లో మెద్వెదెవ్ సర్వీస్‌లను బ్రేక్ చేశాడు. ఫలితంగా 55 విన్నర్లతో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యాడు. మరో సెమీస్‌లో రెండోసీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–4, 7–6 (7/2), 6–4తో లోరెంజో ముసెటీ (ఇటలీ)పై గెలిచి పదోసారి టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించాడు. 2 గంటలా 48 నిమిషాల మ్యాచ్‌లో జొకో 6 ఏస్‌లతో చెలరేగాడు. నాలుగు బ్రేక్ పాయింట్లతో పాటు 34 విన్నర్స్ సాధించాడు. 34 విన్నర్స్ కొట్టిన ముసెటీ 2 ఏస్‌లు, ఒక డబుల్ ఫాల్ట్, 22 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. కాగా, ఆదివారం జరిగే టైటిల్ ఫైట్ లో నొవాక్, కార్లోస్ అమీతుమీ తేల్చుకోనున్నారు.
నేడు విమెన్స్ సింగిల్స్ ఫైనల్
పౌలినిx క్రెజికోవా
సా. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో