వింబుల్డన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నిలబెట్టుకున్న అల్కరాజ్‌‌

వింబుల్డన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నిలబెట్టుకున్న అల్కరాజ్‌‌
  •  వింబుల్డన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నిలబెట్టుకున్న అల్కరాజ్‌‌..   ఫైనల్లో జొకోవిచ్‌‌‌‌పై మళ్లీ గెలుపు
  •     మేజర్ ఫైనల్స్‌‌లో 4-0 రికార్డు

లండన్‌‌‌‌ :  లెజెండరీ ప్లేయర్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ ఆధిపత్యానికి మరోసారి అడ్డుకట్ట వేసిన యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ ఫైనల్లో మూడోసీడ్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ 6–2, 6–2, 7–6 (7/4)తో రెండోసీడ్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ (సెర్బియా)ను ఓడించాడు. 2023 ఫైనల్‌‌‌‌ ఐదుసెట్ల పాటు జరగ్గా, ఈసారి కార్లోస్‌‌‌‌ తన ట్రేడ్‌‌‌‌ మార్క్‌‌‌‌ షాట్లతో మూడు సెట్లలో..  2 గంటల 27 నిమిషాల్లోనే జొకో ఆట కట్టించాడు.  ఫలితంగా రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌‌‌‌స్లామ్ నెగ్గాలన్న సెర్బియా ప్లేయర్‌‌‌‌ కల తీరలేదు. ఇక ఫైనల్‌‌‌‌ చేరిన ప్రతీసారి టైటిల్‌‌‌‌ గెలుస్తాడన్న రికార్డును అల్కరాజ్‌‌‌‌ కొనసాగించాడు. 2022 యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌, 2023 వింబుల్డన్‌‌‌‌, 2024 ఫ్రెంచ్‌‌‌‌, వింబుల్డన్‌‌‌‌ అతని ఖాతాలో ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య ఆరు మ్యాచ్‌‌‌‌ల ముఖాముఖి పోరులో జొకో, అల్కరాజ్‌‌‌‌ చెరో మూడుసార్లు గెలిచారు.

ఆరంభం నుంచే జోరు..

కెరీర్‌‌‌‌లో 8వ వింబుల్డన్‌‌‌‌ టైటిల్‌‌‌‌ నెగ్గి రోజర్‌‌‌‌ ఫెడరర్‌‌‌‌ రికార్డును సమం చేయాలని భావించిన జొకోవిచ్‌‌‌‌ కలకు ఈసారి కూడా అల్కరాజే అడ్డుకట్ట వేశాడు. మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచే బలమైన సర్వీస్‌‌‌‌లతో పాటు కోర్టులో చురుకుగా కదలిన కార్లోస్‌‌‌‌.. జొకోవిచ్‌‌‌‌ కొట్టిన ప్రతీ షాట్‌‌‌‌కు దీటుగా బదులిచ్చాడు. బేస్‌‌‌‌ లైన్‌‌‌‌ గేమ్‌‌‌‌తో పాటు పవర్‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌ విన్నర్లతో రెచ్చిపోయాడు. కార్లోస్‌‌‌‌ దెబ్బకు తొలి సెట్‌‌‌‌లో జొకో మూడు, ఏడో గేమ్‌‌‌‌లో మాత్రమే సర్వీస్‌‌‌‌ను నిలబెట్టుకున్నాడు. ఇక రెండో గేమ్‌‌‌‌లోనూ అల్కరాజ్‌‌‌‌ జోరే కొనసాగింది. మూడు, ఐదో గేమ్‌‌లో మినహా మిగతా అన్ని సర్వీస్‌‌‌‌లను గెలిచిన అల్కరాజ్‌‌‌‌ 2–0 లీడ్‌‌‌‌ సాధించాడు. 

వదిలేసి.. పట్టుకొని.. 

మూడో సెట్‌‌‌‌ ఆరంభంలో జొకో పుంజుకున్నట్టు కనిపించినా అల్కరాజ్‌‌‌‌ ముందు నిలవలేకపోయాడు. ఆధిక్యం చేతులు మారుతూ రావడంతో ఓ దశలో అల్కరాజ్‌‌‌‌ 5–4 లీడ్‌‌‌‌లో నిలిచాడు. కానీ ఈజీగా సెట్‌‌‌‌, మ్యాచ్‌‌‌‌ను గెలిచే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. తన సర్వ్‌‌‌‌లో మూడు చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పాయింట్లను వదిలేశాడు. స్కోరు 40–30 వద్ద11 సార్లు చేతులు మారిన సర్వీస్‌‌‌‌ బాల్‌‌‌‌ను నెట్‌‌‌‌కు కొట్టడం, ఆ వెంటనే జొకోవిచ్‌‌‌‌ అడ్వాంటేజ్‌‌‌‌ వద్ద గేమ్‌‌‌‌ నెగ్గడంతో స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌‌‌‌లో జొకో ఈజీగా సర్వీస్‌‌‌‌ను నిలబెట్టుకుని 6–5తో ముందంజ వేశాడు. 12వ గేమ్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ను నిలబెట్టుకోవడంతో సెట్‌‌‌‌ టైబ్రేక్‌‌‌‌కు దారితీసింది. టైబ్రేక్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌ క్రాస్‌‌‌‌ కోర్టు షాట్లలో జొకోను ముప్పు తిప్పలు పెట్టాడు. మధ్యలో ఒకటి, రెండు డ్రాప్‌‌‌‌ షాట్లు కొట్టినా కీలక టైమ్‌‌‌‌లో మాత్రం బలమైన సర్వీస్‌‌‌‌లతో చెలరేగాడు. దీంతో 6–4 వద్ద ఓ డ్రాప్‌‌‌‌ షాట్‌‌‌‌ కొట్టిన అల్కరాజ్‌‌‌‌ బలమైన ఫోర్‌‌‌‌హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌తో చిరస్మరణీ విజయాన్ని అందుకున్నాడు.క్యాన్సర్‌‌‌‌తో బాధపడుతున్న వేల్స్‌‌‌‌ యువరాణి కేట్‌‌‌‌ మిడిల్టన్‌‌‌‌ ఫైనల్‌‌కు హాజరై విన్నర్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌కు ట్రోఫీని అందజేశారు.

  • 4 అల్కరాజ్‌‌ 21 ఏండ్లకే అందుకున్న  గ్రాండ్‌‌స్లామ్స్‌‌. నడాల్‌‌, ఫెడరర్‌‌‌‌, జొకోవిచ్‌‌ వరుసగా 22, 23, 24 ఏండ్ల వయసులో నాలుగు గ్రాండ్‌‌స్లామ్స్ నెగ్గారు.
  • ఓపెన్‌‌ ఎరాలో వరుసగా ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌, వింబుల్డన్ టైటిల్స్‌‌ గెలిచిన ఆరో ప్లేయర్‌‌‌‌ అల్కరాజ్‌‌. రాడ్‌‌ లేవర్‌‌‌‌, బోర్న్ బోర్గ్‌‌, నడాల్, ఫెడరర్, జొకోవిచ్‌‌ ముందున్నారు.

ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మనీ 

విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రూ. 28.64 కోట్లు
రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: రూ. 14.85 కోట్లు